స్థిరంగా బంగారం ధ‌ర‌.. వెండి మాత్రం..

-

రెండు రోజులుగా తగ్గుదల నమోదు చేసిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా నిలిచింది. మంగళవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా 39,530 రూపాయల వద్ద నిలిచింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా నిన్నటి ధర 36,120 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. అయితే, వెండి ధరలు ఈరోజు కేజీకి వంద రూపాయలు తగ్గాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 47,400 వద్దకు చేరింది.

ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 38,100 రూపాయల వద్దకు నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా మార్పులు లేకుండా 36,900 రూపాయల వద్దఉంది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి వంద రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో వెండి కేజీకి 47,400 రూపాయల వద్దకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news