ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేడు రెండో రోజు ప్రారంభం కానున్నాయి. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్యను పెంచుతూ హిందూ ధార్మిక చట్టంలో సవరణల బిల్లు, మద్యం రేట్లు పెంచుతూ ఎక్సైజ్ చట్టంలో మార్పులు చేస్తూ బిల్లు, పాఠశాల విద్య నియంత్రణ కమిషన్ చట్టంలో సవరణలు చేసిన బిల్లు.. ఈ మూడు బిల్లులను నేడు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. రైతులకు గిట్టుబాటు ధరలపై ఇవాళ టీడీపీ ఆందోళన చేపట్టనుంది.
అసెంబ్లీ దగ్గర నిరసన చేపట్టనున్న టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ ఎమ్మెల్యేలు నిరసన తెలియజేయనున్నారు. కాగా.. శాసనసభ శీతాకాల సమావేశాలు ఏడు రోజులు జరుగనున్నాయి. 12-15 రోజులు జరుపుదామనుకున్నామని.. కానీ 18న 15వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి వస్తోందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.