బ్రేకింగ్: భారీగా పైకెగ‌సిన‌ బంగారం ధ‌ర‌.. వెండి మాత్రం..

-

నిన్న మొన్నా కాస్త తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్ళీ భారీగా పైకెగ‌సి షాక్ ఇచ్చాయి. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర పరుగులు పెట్టింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.210 పైకి కదిలింది. దీంతో పసిడి ధర రూ.40,610 నుంచి రూ.40,820కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పైకి కదిలింది. ఇది కూడా రూ.210 పెరిగింది. దీంతో ధర రూ.44,340 నుంచి రూ.44,550కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.360 తగ్గిన విషయం తెలిసిందే.

ఇక బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం పడిపోతూనే వస్తోంది. రూ.200 క్షీణించింది. దీంతో కేజీ వెండి ధర రూ.49,800 నుంచి రూ.49,600కు దిగొచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 42,900 రూపాయల వద్దకు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరుగుదల నమోదు చేసి 41,700 రూపాయల వద్ద నిలిచింది. ఇక కేజీ వెండి ధర ఇక్కడ కూడా కాస్త తగ్గింది. దీంతో కేజీ వెండి 49,600 రూపాయలకు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news