కుప్పకూలిపోయిన బంగారం, వెండి ధరలు..!

-

పసిడి ప్రియులకు శుభవార్త. గత కొన్ని రోజులుగా చుక్కలు చూయిస్తున్న బంగారం ధరలు ఎట్టకేలకు దిగొచ్చాయి. భారీగా పడిపోయిన బంగారం ధర చూసి గోల్డ్ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక బంగారం బాటలో నడిచిన వెండి ధర మరింత పడిపోయింది. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ. 2930 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 55,760కు చేరింది.

అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల ధర రూ. 2,690 తగ్గడంతో రూ. 51,110కు చేరుకుంది. అయితే వెండి ధర మాత్రం భారీగా పడిపోయింది. కేజీ వెండి ధర రూ. 7250 తగ్గిపోయింది. దీంతో ధర రూ. 66,950కు చేరింది. ఇక శ్రావణ మాసం పూర్తి కావస్తుండడం.. వచ్చే వారంలోనూ బంగారం, వెండి ధరల్లో పెద్దగా మార్పులు చోటు చేసుకోక పోవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news