జువెలర్ల నుంచి డిమాండ్ తగ్గడంతో పాటు.. బలహీన అంతర్జాతీయ సంకేతాలు కారణంగా గత రెండు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరకి బ్రేక్ పడింది. దీంతో పది గ్రాముల బంగారం ధర రూ.115 తగ్గుదలతో రూ.33,210కు చేరింది.. నిన్నటితో పోల్చితే వెండి ధరలు మాత్రం పెరిగాయి. కేజీ వెండి ధర రూ.310 పెరుగుదలతో రూ.40,160కు పెరిగింది. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్‌కు 0.11 శాతం క్షీణతతో 1,284.30 డాలర్లకు తగ్గింది. వెండి ధర ఔన్స్‌కు 0.16 శాతం పెరుగుదలతో 15.43 డాలర్లకు ఎగసింది. తాజా మార్పులతో ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.33,210కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.115 తగ్గుదలతో రూ.33,060కు చేరింది.