నిజంగా బంగారం ప్రియులకు బంగారం లాంటి వార్త ఇది. సామాన్య మానవులు అందుకోలేనంత ఎత్తుకు చేరుకున్న బంగారం ధరలు గత నాలుగు రోజుల నుంచి కాస్త తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ బలపడ్డమే. గత వారంలో రికార్డు స్థాయిలో 10 గ్రాముల బంగారు ధర ఏకంగా రూ. 48,982 పలకగా, అయితే ఆ తర్వాత నాలుగు రోజులలో తులం బంగారం ధర ఏకంగా వెయ్యి రూపాయల వరకు తగ్గింది.
ఇక నేడు ఎంసీఎక్స్ లో 10 గ్రాముల పసిడి ధర మరింతగా క్షీణించింది. ఇక బంగారం తో పాటు వెండి కూడా తగ్గింది. తాజా సమాచారం ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ బంగారం 0.1 శాతం తగ్గి ఒక ఔన్స్ ధర 1772 డాలర్లకు చేరుకుంది. ప్రపంచ మార్కెట్లో ఒడిదుడుకుల కారణంగా బంగారం ధర కాస్త నిలకడగా కొనసాగుతుంది. తాజా వివరాల ప్రకారం.. బంగారం ధర పది గ్రాములు రూ. 47,882 గా ఉండగా, రూ. 49,000 వద్ద వెండి కొనసాగుతోంది.