కరోనా పరీక్షలు నిర్వహించుకోడానికి ప్రభుత్వాలు ప్రైవేట్ ల్యాబ్ లకు అనుమతులు ఇచ్చాయి. కాగా ఆ ల్యాబ్ లు ప్రాభుత్వాలు పెట్టిన ఆంక్షలు నిబంధనలు పాటించాలు. కానీ కొన్ని ల్యాబ్ లు అలాంటి నిబంధనలు పాటించకుండా ఇటువంటి ఆపత్కర సమయాన్ని బిజినెస్ చేసుకుంటున్నాయి. టెస్టులు చేయించుకోడానికి వచ్చిన వారి నుండి వేలకు వేలు వసూల్ చేస్తున్నాయి అంతే కాదు డబ్బు ఎక్కువ ఇస్తే తమకు ఫేవర్ గా పరీక్ష ఫలితాన్ని ఇస్తున్నాయి.
ఇలా నియమాలను ఉల్లంఘించి మార్గదర్శకాలను తుంగలో తొక్కిన హైదరబాద్ లోని ఓ ప్రైవేట్ ల్యాబ్ ను తెలంగాణ ప్రభుత్వం మూసివేసింది. ఇక ఇదే క్రమంలో ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ లో ఓ ప్రైవేట్ ల్యాబ్ ఇలాంటి నిర్వాకానికే పాల్పడింది. తమ వద్దకు టెస్టులు చేయించుకుందామని వచ్చిన వారి వద్ద నుండి భారీగా డబ్బులు లాగడమే కాకుండా 2500 రూపాయలు ఇస్తే నెగిటివ్ రిపోర్ట్ ఇస్తామని చెప్పింది. ఆ విషయం కాస్త అధికారుల దృష్టికి వెళ్ళగా వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆ ల్యాబ్ లైసెన్స్ రద్దు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.