వై30 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన వివో.. ధ‌ర ఎంతంటే..?

-

మొబైల్స్ త‌యారీదారు వివో.. వై30 పేరిట ఓ నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6.47 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. మీడియాటెక్ హీలియో పి35 ప్రాసెస‌ర్‌, 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ల‌ను అందిస్తున్నారు. వెనుక భాగం గ్లాసీ లుక్‌ను క‌లిగి ఉంటుంది. అక్క‌డే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ వెనుక భాగంలో 13 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాతోపాటు 8 మెగాపిక్స‌ల్ అల్ట్రావైడ్ లెన్స్‌, 2 మెగాపిక్స‌ల్ డెప్త్ సెన్సార్‌, 2 మెగాపిక్స‌ల్ సెన్సార్‌లు ఉన్నాయి. ముందు భాగంలో 8 మెగాపిక్స‌ల్ కెమెరాను అమ‌ర్చారు. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌ను ఏర్పాటు చేశారు. 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ క‌లిగిన బ్యాట‌రీని ఈ ఫోన్‌లో అమ‌ర్చారు.

vivo launched Vivo Y30 smart phone in india

వివో వై30 స్పెసిఫికేష‌న్లు…

* 6.47 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1560 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి35 ప్రాసెస‌ర్‌, 4జీబీ ర్యామ్
* 128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 10, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్
* 13, 8, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* 8 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ
* బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

వివో వై30 స్మార్ట్‌ఫోన్ రూ.14,990 ధ‌ర‌కు ఫ్లిప్‌కార్ట్‌లో ల‌భిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news