షాకింగ్ : భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. రూ. 53 వేల మార్క్ దాటిన‌ బంగారం

-

బంగారం, వెండి కొనుగోలు చేసేవారికి ధ‌ర‌లు షాక్ ఇస్తున్నాయి. సామాన్యుల కంటిపై కునుకు లేకుండా.. వ‌ర‌స‌గా మూడో రోజు బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల బంగారం పై రూ. 350 నుంచి రూ. 390 వ‌ర‌కు పెరిగాయి. దీంతో బంగారం మ‌రో సారి రికార్డు ధ‌ర ప‌లికింది. 10 గ్రాముల బంగారం ధ‌ర 53 వేల మార్క్ ను అందుకంది. వ‌ర‌స‌గా మూడు రోజుల నుంచి భారీగా ధ‌ర‌లు పెరుగుతున్నాయి. దీంతో బంగారం ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుకున్నాయి.

ఈ మూడు రోజుల్లో 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 880 వ‌ర‌కు పెరిగింది. ఇక వెండి ధ‌ర‌లు కూడా గత మూడు రోజుల నుంచి వ‌ర‌స‌గా పెరుగ‌తూ వ‌స్తున్నాయి. ఈ మూడు రోజుల్లో కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 800 వ‌ర‌కు పెరిగింది. కాగ ఈ రోజు పెరిగిన ధ‌రల ప్ర‌కార.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

తెలంగాణ‌లోని హైద‌రాబాద్, ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని విజ‌య‌వాడ న‌గ‌రాల్లో 10 గ్రాముల బంగారం.. 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 48,600 కు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 53,020 కి చేరింది. అలాగే కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 71,500 కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news