హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో శ్రీరామనవమి కూడా ఒకటి. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి చైత్ర శుద్ధ నవమి నాడు వస్తుంది. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటలకి త్రేతాయుగం లో జన్మించారు.
శ్రీరాముడు జన్మించిన రోజున కనుక ఆ రోజున పండగగా జరుపుకుంటారు. సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. అందుకే అతి వైభవంగా దేవాలయాలలో శ్రీరామనవమి వేడుకలు జరుపుతారు. ముఖ్యంగా భద్రాచలం ఆలయంలో సీతారామ కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరుపుతారు. ఆలయ పండితులు చేత నిర్వహించబడే సీతారాముల కళ్యాణం చూడడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు.
అయితే ఈ ఏడాది శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది శ్రీరామనవమి నాడు ఇలాంటి పద్ధతులు పాటించాలి అనే దాని గురించి చూద్దాం. హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రీరామనవమి పండుగ ఈ సంవత్సరం ఏప్రిల్ 10 న వచ్చింది. చైత్ర నవరాత్రులు తర్వాత హిందువులు జరుపుకునే మొదట పండుగ ఇది.
శ్రీరామనవమి ముహూర్తం:
శ్రీరామనవమి మధ్యాహ్నం ముహూర్తం: ఉదయం 11:07 నుంచి మధ్యాహ్నం 01:40 వరకు
ముహూర్త కాల వ్యవధి: 02 గంటల 32 నిమిషాలు
శ్రీరామనవమి మధ్యాహ్న క్షణం: మధ్యాహ్నం 12:23
నవమి తిథి: 01:23 గంటలకు మొదలు, 2022 ఏప్రిల్ 11న తెల్లవారుజామున 03:15 గంటలకు ముగింపు
శ్రీరామనవమి నాడు తప్పక పాటించాల్సిన పద్దతులు:
శ్రీరామనవమి నాడు పూజగదిని శుభ్రం చేసుకునే రాముడు విగ్రహానికి లేదా ఫోటోకి పూజలు చేయాలి.
శ్రీరాముడుని పూలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి.
అలానే దేవుడికి ప్రసాదం కూడా సిద్ధం చేసుకోవాలి. చలివిడి, వడపప్పు, పానకం, పండ్లు తప్పనిసరిగా పెడతారు.
రామాయణం లేదా రాముడు శ్లోకాలు లేదా మీకు నచ్చిన గ్రంథాలను చదవచ్చు.
సీతా సమేత శ్రీ రామునికి హారతులు ఇచ్చి పూజను ముగించాలి.
శ్రీ రామ నవమి నాడు శ్రీ రాముని పూజించడం వల్ల సకల పాపాలు పోతాయి అలానే ముక్తి పొందవచ్చని భక్తుల నమ్మకం.
శ్రీరామనవమి నాడు చాలామంది ఉపవాసం కూడా చేస్తారు. శ్రీరామనవమికి ముందు అర్ధరాత్రి నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉపవాసం చేస్తారు. కొందరు 24 గంటలు కూడా చేస్తారు. ఉపవాసం చేసేవారు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. పండ్లు, పండ్ల రసాలు లేదా పాలు వంటివి ఉపవాసం వున్నా తీసుకోవచ్చు కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే శ్రీరామనవమినాడు తీసుకోవాలి.