మామూలుగా మనం ఎయిర్ పోర్ట్స్ లో ఎవరో ఒకరు ఏదో ఒక సమయాన అక్రమంగా విదేశాల నుండి బంగారు తీసుకురావడాన్ని గమనిస్తూనే ఉంటాం. ఇలా తీసుకు వచ్చేవారు వివిధ రకాల మార్గాలను అవలంభిస్తూ కొత్త కొత్త ఆలోచనలతో బంగారం, మాదక ద్రవ్యాలను విదేశాల నుండి భారతదేశానికి తీసుకురావడం గమనిస్తూనే ఉంటాం. ఇలాంటి సంఘటనలు మనం సినిమాల్లో కూడా చూసే ఉంటాం. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి బంగారం తరలించే విషయంలో ఓ వ్యక్తి అడ్డంగా బుక్కయ్యాడు. ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…
కాలికట్ లోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అధికారులు ఓ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు కరోనా వైరస్ రాకుండా ఉపయోగించే n95 మాస్క్ లో ఆ బంగారాన్ని ఉంచాడు. మాస్క్ లో పెడితే ఎవరు చూస్తారులే అనుకున్నా ఆ వ్యక్తికి కస్టమ్స్ అధికారులు షాక్ ఇచ్చారు. అతను వాడుతున్న n95 మాస్క్ లో 40 గ్రాముల బంగారం దాచిపెట్టి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. ఇందుకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించి వీడియో మీరు కూడా చూసేయండి ఆ ఘనుడు ఏవిధంగా బంగారాన్ని మాస్క్ లో పెట్టి తరలిస్తున్నాడో.