పసిడి ప్రియులకి బ్యాడ్ న్యూస్.. ధరలు పైపైకి…!

-

మీరు బంగారం కొనుగోలు చెయ్యాలని అనుకుంటున్నారా…? అయితే మీకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పుడు మరోసారి పసిడి ధర పైకి కదిలింది. దీనితో బంగారం కొనాలని అనుకునే వాళ్ళకి ఝలక్ తగిలింది అనే అనాలి. వరుసగా రెండు రోజులుగా బంగారం ధర పరుగులు పెడుతూనే వస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…

అంతర్జాతీయ మార్కెట్‌ లో బంగారం ధర పెరుగుదల నేపథ్యం లో దేశీ మార్కెట్‌లోనూ పసిడి పైకి కదిలిందని తెలుస్తోంది. ఇక ధరల గురించి చూస్తే… హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర పెరిగింది.

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పైకి కదిలింది. దీనితో ధర రూ.48,930కు చేరడమా జరిగింది. అలానే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇలానే వుంది. రూ.220 పెరుగుదలతో రూ.44,870కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.37 శాతం పెరిగింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1844 డాలర్లకు చేరింది. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ ఆధారంగా రేట్లు వుంటాయని తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news