Gold Rates: ఎప్పుడూ ఆకాశమే హద్దుగా సాగే పసిడి ధరలు.. గత నాలుగైదు రోజుల నుంచి రెక్కలు తేగిన పక్షిలా నేల చూపులు చూస్తున్నాయి. క్రమంగా బంగారం ధరలు తగ్గుతు వస్తున్నాయి. దీంతో పసిడి ప్రియులు ఇదే సువర్ణవకాశంగా భావించి.. కొనుగోలు చేస్తున్నారు. ఈ సమయంలో వీరు మరో విషయం కచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకో.. మీరు బంగారం కొనుగోలు నిర్ణయాన్ని మరో రెండు రోజులు వాయిదా వేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఏంటీ ? వాయిదా వేసుకోవాలా ? ఎందుకంటారా?
రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత కాస్త దిగిరావొచ్చని విశ్లేషకులు చెప్పుతున్నారు. అసలు.. పసిడి రేట్లను అంతర్జాతీయ మార్కెట్‌లోని పరిస్థితులు నియంత్రిస్తుంటాయి. అమెరికా డాలర్, జాబ్ డేటా, రిటైల్ స్టాటస్టిక్స్ ఆధారంగా బంగారం ధరలను నిర్ణయించబడుతాయి.
అయితే.. ఈ నెల 21, 22 న అమెరికా ఫెడరల్ రిజర్వు మీటింగ్ జరుగనున్నది. ఈ మీటింగ్ లో తీసుకునే నిర్ణయాలపై పసిడి ధరలు కదలనున్నాయి. ఈ సమావేశం అజెండా ప్రకారం.. బంగారం ధరలు తగ్గే అవకాశమున్నట్టు విశ్లేషకులు తెలుపుతున్నారు. దీనికి తోడు.. ఎకనమిక్ ఇండికేటర్లు కూడా అనుకూలంగా ఉండటం, ద్రవ్యోల్బణం సిర్థంగా ఉండటం అంశాల ప్రాతిపదికన చూస్తే.. ఫెడ్ పైన పేర్కొన్న నిర్ణయాలు తీసుకోవచ్చని అంచనాకు రావొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. అని సానుకూలంగా ఉంటే.. బంగారం ధరలు మరింత తగ్గే అవకాశముంది.
ఈ రోజు ఉదయం ఆరు గంటల వరకు నమోదైన రేట్ల ప్రకారం.. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,130 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,130 వద్ద కొనసాగుతోంది.
నిన్నటితో పోలితే.. తులం బంగారంపై రూ.260 మేర తగ్గింది.
ప్రధాన నగరాల్లో ధరలిలా ఉన్నాయి..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,580గా నమోదైంది.
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,130 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,130గా కొనసాగుతుంది.
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,230గా నమోదైంది.
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,230గా కొనసాగుతుంది.
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.47,230గా పలుకుతుంది.