కొంచెం తగ్గిన బంగారం ధరలు…!

-

కరోనా వైరస్ నేపధ్యంలో ప్రపంచ వ్యాప్తంగా బంగారంకు డిమాండ్ అనేది పడిపోతు వస్తుంది. ప్రతీ రోజు కూడా బంగారం ధరలు తగ్గుతున్నాయి. గత వారంలో నాలుగు రోజులు పెరిగిన బంగారం ధర అక్కడి నుంచి పెరుగుతూ వస్తుంది. దేశంలో ఇప్పుడు బంగారానికి డిమాండ్ అనేది పడిపోయింది. శనివారం రోజు భారీగా తగ్గిన బంగారం ధరలు నేడు కూడా దిగి రావడం గమనార్హం. సోమవారం హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధర తగ్గింది.

బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు 90 రూపాయల దిగి వచ్చింది. దీనితో 40,510 రూపాయలుగా ఉంది బంగారం ధర. 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే… పది గ్రాములకు 90 రూపాయల తగ్గడంతో 44,200 రూపాయలకు దిగి వచ్చింది. విజయవాడ విశాఖపట్నం విషయానికి వస్తే… ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాముల ధర..

90 రూపాయల వరకు తగ్గింది. దీనితో 40,510 రూపాయలుగా ఉంది బంగారం. 24 క్యారెట్ల బంగారం ధర 90 రూపాయలు తగ్గడంతో… 44,200 రూపాయలకు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే… 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 44,550 రూపాయలకు చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 60 రూపాయల పెరుగడంతో 41,980 రూపాయలకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news