దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత గంట గంటకు పెరుగుతుంది. లాక్ డౌన్ ఉన్నా సరే కేసులు మాత్రం ఆగడం లేదు. అటు మరణాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. 543 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,265 మందికి కరోనా సోకింది, యాక్టివ్ కేసులు 14, 175గా ఉన్నాయి.
ఇక కోలుకున్న వారి సంఖ్య చూస్తే 2456 గా ఉందని కేంద్రం పేర్కొంది. మహారాష్ట్రలో మరో రెండు రోజుల్లో కేసులు నాలుగు వేల మార్క్ దాటే అవకాశాలు కనపడుతున్నాయి. నేటి నుంచి కేంద్రం కొన్ని మార్గదర్శకాలను లాక్ డౌన్ కోసం అని విడుదల చేయగా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు పక్కాగా అమలు చెయ్యాల్సిందే ఏ మాత్రం కూడా సడలించే అవకాశం లేదని స్పష్టం చేసారు.
తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో నిన్న 44 కేసులు బయటపడగా తెలంగాణాలో 18 కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం లాక్ డౌన్ ని మరింత పక్కాగా అమలు చేస్తేనే దీని నుంచి బయటపడే అవకాశం ఉంటుందని రాష్ట్రాలు బలంగా నమ్ముతున్నాయి. ఇక తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లో కేసులు పెరుగుతున్నాయి.