మళ్ళీ ఊపందుకున్న బంగారం…!

-

బంగారం ధరలు మళ్ళీ ఊపందుకున్నాయి. ఇన్నాళ్ళు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు మళ్ళీ పెరిగాయి. శనివారం పెరిగిన బంగారం ధర సోమవారం కూడా పెరిగింది. డిమాండ్ తగ్గినా సరే బంగారం ధర మాత్రం తగ్గలేదు. హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.600 వరకు పెరిగింది. దీనితో పది గ్రాముల బంగారం ధర హైదరాబాద్ మార్కెట్ లో రూ.43,270కు చేరింది.

అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదే స్థాయిలో పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.570 పెరగడంతో రూ.39,660కు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీ లో బంగారం అదే స్థాయిలో పెరుగుదల నమోదు చేయడం విశేషం. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 పెరుగుదలతో రూ.41,700కు చేరుకుంది. అయితే హైదరాబాద్ మార్కెట్ తో పోలిస్తే ఢిల్లీ లో బంగారం ధర తక్కువగా ఉంది.

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.600 పెరుగుదలతో రూ.40,500కు చేరుకుంది. కేజీ వెండి ధర విషయానికి వస్తే రూ.50 పెరుగుదలతో రూ.40,550కు చేరింది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటిస్తున్న నేపధ్యంలో బంగారం ధరలు దిగి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం అరోనా నేపద్యంలో బంగారం కొనే వాళ్ళు అంటూ ఎవరూ లేకపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news