దేశంలో కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. మొన్నటి వరకు 50వేల దిగువకు పడిపోయిన పుత్తడి.. మళ్లీ హాఫ్ సెంచరీ దాటేసింది. అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి విలువ పడిపోవడం, బంగారం ధర పెరగడంతో దేశీ మార్కెట్లో గోల్డ్ భారమైంది. వరుస పతనాలకు బ్రేక్ పడడంతో తిరిగి 50వేల మార్కును దాటేసింది. అమెరికాలో ఉద్దీపన ప్యాకేజీలపై సంకేతాలతో ధరలు పెరుగుతున్నాయంటున్నారు నిపుణులు. మంగళవారం పదిగ్రాముల గోల్డ్ ధర 50 వేల 420 పలికింది.
బంగారంతోపాటుగానే దేశీయంగా సిల్వర్ ధర కూడా పెరుగుతోంది. కిలో వెండి ఏకంగా 995 రూపాయలు పెరిగి 61 వేల 390 రూపాయలు పలికింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ 1.56 డాలర్లు ఎగబాకి ఔన్స్ కు 1882 డాలర్లుగా నమోదైంది. అమెరికా అధ్యక్ష అభ్యర్ధుల మధ్య చర్చలకు ముందు డాలర్ బలహీనపడడంతో బంగారం ధరలు తగ్గి…మార్కెట్లు నష్టాలను చూశాయి.