దీపావళి ఎఫెక్ట్ : పెరిగిన పసిడి ధర

-

గత కొద్ది రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తోన్న బంగారం ధరలు ఈ రోజు మాత్రం నిన్నటి ధర కంటే కాస్త గట్టిగానే పెరిగాయి. దీపావళి పండుగ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది కాస్త చేదు వార్త అనే చెప్పాలి. నిజానికి గత ఐదు రోజులుగా బంగారం ధర పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా నామమాత్రంగా పెరిగింది. హైదరాబాద్‌ సహా విశాఖ పట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹51,760కి పెరిగింది. అలానే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹47,450కి పెరిగింది. అయితే ఢిల్లీ మార్కెట్‌ లో కూడా ఈ రేట్ స్వల్పంగానే నమోదైంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹53,630కి చేరింది. ఇక కేజీ వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. అయితే నిన్నటి మీద కేజీ పది రూపాయలు పెరగడంతో కేజీ వెండి ధర ₹63,310 రూపాయల వద్దకు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news