గుడ్ న్యూస్ : భారీగా తగ్గిన బంగారం ధర

-

అవును మీరు చూస్తున్నది నిజమే, బంగారం ధర భారీగా దిగొచ్చింది. ఇక బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇదే మంచి సమయం అని చెప్పచ్చు. ఇక బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పెరిగింది. ఇక హైదరాబాద్ మార్కెట్‌ విషయనికి వస్తే గత మూడు రోజుల్లో బంగారం ధర తగ్గిందని చెప్పచ్చు.

నిన్న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 570 తగ్గడంతో రూ.51,650 దాకా చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ. 530 దాకా తగ్గింది. దీంతో 10 గ్రాముల ధర రూ. 47,340కు చేరింది. కానీ బంగారం ధర భారీగా తగ్గితే వెండి ధర మాత్రం కాస్త గట్టిగానే పెరిగింది. కేజీ వెండి ధర గత మూడు రోజుల్లో భారీగా పెరిగింది. ఏకంగా కేజీ వెండి ధర మూడు రోజుల్లో రూ. 3100 దాకా పెరిగింది. ఈ లెక్కన వెండి ధర రూ.65,200కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news