అవును మహిళలకి ఇది గుడ్ న్యూస్ ఏ కదా. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర దిగి రావడంతో మన దగ్గర కూడా బంగారం ధర దిగొచ్చింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలని అనుకునే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు.
హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.1,890 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.51,050కు తగ్గింది. అలానే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.1,730 తగ్గింది. దీంతో 10 గ్రాముల ధర రూ.46,800కు తగ్గింది. అయితే బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం కొంచెం పెరిగింది. కేజీ వెండి ధర రూ.100 పెరిగింది. దీంతో వెండి ధర రూ.61,700కు పెరిగింది. మొత్తానికి పండుగల సమయంలో ఇది శుభవార్తే అని చెప్పాలి. దసరా సమీపిస్తుండడంతో పెళ్లిళ్లు కూడా పెరిగిపోతాయి.. వారికి కూడా బంగారం ధరలు ఉపశమనం కలిగిస్తాయని చెప్పచ్చు.