చైనా ఆదివారం తన ప్రయోగాత్మక కరోనా వ్యాక్సిన్లను మరో మూడు నగరాలకు అత్యవసర ఉపయోగం కోసం అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ల సమాన పంపిణీని ఖరారు చేయడానికి గానూ ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవాక్స్ కూటమిలో చేరాలని చైనా నిర్ణయించిన కొన్ని రోజులకు ఈ ప్రకటన చేసారు. ప్రస్తుతం, కరోనావైరస్ కోసం మొత్తం 11 టీకాలు చైనాలో వివిధ దశలలో ఉన్నాయి.
ఈ టీకాలలో నాలుగు క్లినికల్ ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయి, వాటిలో మూడు ఫ్రంట్ లైన్ కార్మికుల అత్యవసర ఉపయోగం కోసం ఆమోదించారు. చైనా యొక్క తాజా నిర్ణయంతో, దాని ప్రయోగాత్మక కోవిడ్ -19 వ్యాక్సిన్లు జెజియాంగ్ ప్రావిన్స్ యొక్క యివు, నింగ్బో మరియు షావోక్సింగ్ నగరాల్లోని అందిస్తారు. సాధారణ పౌరులకు తక్షణ అవసరం కోసం వ్యాక్సిన్ ఇస్తామని చైనా పేర్కొంది.