యాదాద్రి నరహింహుడి ఆలయానికి స్వర్ణ తాపడం డిజైన్ రెడీ

-

యాదాద్రి ఆలయం కొత్త శోభను సంతరించుకోనుంది. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ గోపురానికి బంగారు తాపడాన్ని అమర్చనున్నారు. అందుకు సంబంధించిన ఓ డిజైన్‌ను అధికారులు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.సీఎం రేవంత్‌రెడ్డి‌తో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఇతర ఉన్నతాధికారులు నిర్వహించిన సమీక్షా సమావేశంలో యాదాద్రి ఆలయ రాజగోపురానికి బంగారు తాపడంపై సమగ్రంగా చర్చించినట్లు సమాచారం.

ముందుగా 127కిలోల బంగారంతో బంగారు తాపడాన్ని తయారు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించగా..కొన్ని కారణాల చేత 65 కిలోలకు దానిని తగ్గించారు.దేశవ్యాప్తంగా వచ్చిన విరాళాల ద్వారా ఆలయానికి 11.5 కిలోల బంగారం, రూ.20 కోట్ల నగదు కానుకలు వచ్చినట్లు సమాచారం. భక్తుల నుంచి వచ్చిన బంగారు కానుకలను ప్యూర్ గోల్డ్ చేయడం,అదేవిధంగా వెండి ఆభరణాలను కరిగించి సమాన ఎత్తులో 25 కిలోల బంగారాన్ని మింట్‌ నుంచి తీసుకోనున్నారు. 10,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రాజగోపురానికి బంగారు తాపడం వేసే పనులకు చెందిన వ్యయాన్ని అధికారులు ఇప్పటికే అంచనా వేశారు. మొత్తం పనుల పూర్తికి రూ.6కోట్ల అవ్వొచ్చని అంచనా.గ్లోబల్‌ టెండర్ ప్రక్రియలో ఎవరు తక్కువగా కోట్ చేస్తే..వారికి ఈ కాంట్రాక్టును అప్పగించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news