ఆర్ఆర్ఆర్ కి “గోల్డెన్ టొమాటో” అవార్డు..!

-

రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్… ఇప్పుడు ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో సందడి చేస్తోంది. ఇప్పటికే నాటు నాటు పాటకు గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా పలు అంతర్జాతీయ స్థాయి అవార్డులను కూడా ఈ సినిమా పలు విభాగాల ద్వారా సొంతం చేసుకోవడం జరిగింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుకు కూడా ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట నామినేట్ అయ్యి మరింత పాపులారిటీ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు మరో అంతర్జాతీయ స్థాయి అవార్డును ఆర్ఆర్ఆర్ సినిమా సొంతం చేసుకుంది. రోటెన్ టొమాటోస్ వారి యొక్క అంతర్జాతీయ స్థాయి అవార్డును ఆర్ఆర్ఆర్ సొంతం చేసుకోవడం జరిగింది. 2022 ఫ్యాన్స్ ఫేవరెట్ చిత్రంగా “గోల్డెన్ టొమాటో” అవార్డును ఈ సినిమా సొంతం చేసుకున్నట్లు తాజాగా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇప్పటికే వచ్చిన అంతర్జాతీయ అవార్డుల జాబితాలో ఈ అవార్డు కూడా వచ్చి చేరిందని చిత్ర బృందం హర్షం వ్యక్తం చేస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

సుమారు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాకు కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందించగా.. రాజమౌళి అంతకుమించి టేకింగ్ ఇచ్చారు.. మొత్తానికైతే ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అవార్డుల వర్షం కురిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news