ఫ్యాక్ట్ చెక్: 1,750 కడితే పదిలక్షల లోన్.. నిజమేంటి..?

-

ఈ మధ్యకాలంలో నకిలీ వార్తలు బాగా ఎక్కువైపోయాయి. చాలా మంది అనవసరంగా నకిలీ వార్తలని చూసి మోసపోతున్నారు. పైగా అదే నిజం అనుకొని ఇతరులకి కూడా షేర్ చేస్తున్నారు. ఏది ఏమైనా నకిలీ వార్తలతో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే సమస్యలు తప్పవు. సోషల్ మీడియాలో ఒక వార్త ఇప్పుడు తెగ షికార్లు కొడుతోంది. ఆ వార్తలో నిజం ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రధానమంత్రి ముద్ర యోజన స్కీం గురించి మనకి తెలిసిందే ఈ స్కీం ద్వారా చాలామంది ప్రయోజనాన్ని పొందుతున్నారు. ప్రధాన నరేంద్ర మోడీ ఈ స్కీమ్ ద్వారా ప్రజలకి లోన్ సదుపాయం కల్పిస్తున్నారు ఇక తాజాగా వచ్చిన వార్త గురించి చూస్తే పీఎం ముద్ర యోజన స్కీం ద్వారా 10 లక్షల రూపాయల లోన్ ని ప్రజలకు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ లోన్ పొందాలంటే రూ.1750 కట్టాలని ఆ వార్తలో ఉంది మరి నిజంగా ఈ లోన్ వస్తుందా..? డబ్బులు కట్టొచ్చా అనేది చూస్తే… ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది రూ.10 లక్షల లోన్ రూ.1750 రూపాయలు కడితే వస్తాయనేది అబద్ధం. ఇది వట్టి నకిలీ వార్త మాత్రమే ఇందులో ఏ మాత్రం నిజం లేదు కాబట్టి అనవసరంగా ఇటువంటి నకిలీ వార్తలు చూసి మోసపోకండి. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించింది. ఇది వట్టి నకిలీ వార్త మాత్రమే.

Read more RELATED
Recommended to you

Latest news