వైఎస్ షర్మిల పార్టీపై మాజీ ఆర్టీసీ చైర్మెన్ గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో షర్మిల పార్టీ ప్రభావం ఏమాత్రం ఉండదని… కుటుంబ తగాదాలను తెలంగాణలో అంటగట్టాలని చూస్తోందని ఫైర్ అయ్యారు. షర్మిలకు పదవి ఇవ్వనందుకే పార్టీ పెట్టిందని పేర్కొన్నారు. ఇంట్లో గొడవ వల్ల.. తెలంగాణలో పార్టీ పెట్టే పరిస్థితికి వచ్చిందని వెల్లడించారు. ఇవాళ నిర్మల్ జిల్లా కేంద్రంలోని బిజెపి నాయకుడు అంజుకుమార్ రెడ్డి ఇంటికి వెళ్లిన గోనె ప్రకాశ్ రావు.. ఈ వ్యాఖ్యలు చేశారు.
నిర్మల్ జిల్లాలో గొలుసుకట్టు చెరువులు కబ్జాకు గురయ్యాయని… ప్రజలకు అందుబాటులో లేకుండా ఒక చెరువులో కలెక్టర్ కార్యాలయాలు నిర్మిస్తున్నారని తెలిపారు. దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి అసౌకర్యంగా ఉంటుందని… మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఊరికి దగ్గర చెరువులో నిర్మిస్తున్నాడని వెల్లడించారు. మంత్రికి అక్కడ ఒక వంద యాభై ఎకరాలకు పైగా భూమి ఉందని… దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి అసౌకర్యంగా ఉంటుందన్నారు. ధర్మసాగర్ చెరువు వాక్ వే బయట శిఖం వదిలారని.. అది కబ్జాకు గురయ్యే అవకాశం ఉందన్నారు. జిల్లాను ఏక ఛత్రాధిపత్యంగా ఏలుతున్నాడు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై ఫైర్ అయ్యారు.