ప్రభుత్వం ధరణి ఫోటోలు దరిద్రాన్ని వదులుచుకునేందుకే యత్నిస్తోంది. అయితే ఆర్ ఓ ఆర్ 2021 సవరణల కంటే కొత్త చట్టాన్ని రూపొందించుకోవడానికి మొగ్గు చూపిస్తోంది. ఒకటి రెండు సవరణలతో మెరుగైన సేవలు అందించే అవకాశం లేదు. అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రతి అంశంలోనూ మార్పులు అనువార్యంగా మారిన నేపథ్యంలో కొత్త భూ పరిపాలన దిశగా అడుగులు వేయడం ద్వారా చిక్కులు ఎదురు కావచ్చని భావిస్తున్నారు. సవరణల జాబితా మారుతున్నది.
అందుకే ఫిబ్రవరి 24న 33 మంది జిల్లా కలెక్టర్లతో ధరణి కమిటీ కీలక సమావేశం కానున్నది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉదయం పదిన్నర గంటల నుంచి ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని సేకరించనున్నారు. ఇన్ని రోజులుగా గుర్తించిన ప్రతి ఇష్యూ పైన మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే నలుగురు కలెక్టర్లతో ప్రత్యేకంగా సమావేశమై ధరణి పోటాలు పనితీరు సాంకేతిక లోపాలు పనిలో వేగం సవర్ణల వంటి అనేక అంశాలపై డిస్కస్ చేశారు. ఇప్పుడు అన్నింటి పైన చర్చించి త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు ధరణి కమిటీ నిర్ణయించింది. ధరణి కమిటీ సభ్యులు ఎం సునీల్ కుమార్ రెహ్మాన్ పీటర్ ఎం కోదండ రెడ్డి మధుసూదన్ లు కలెక్టర్ తో మాట్లాడనున్నారు.