ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా పెద్ద ప్రజల శ్రేయస్సు కోసం ఎన్నో మంచి మంచి పధకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పధకాలను అందుకుంటున్న వారందరూ ఎంతో సంతోషంగా తమ కాళ్లపై తాము నిలబడి జీవిస్తున్నారు. జగన్ ఇస్తున్న చాలా పథకాలలో వాహనామిత్ర మరియు కాపు నేస్తం పధకాలు కూడా ఉన్నాయి. కాగా ఇటీవల ఈ పధకాలను దరకాస్తు కోసం ఒక తేదీని నిర్ణయించింది ప్రభుత్వం. అయితే ప్రభుత్వం ఇచ్చిన గడువు ప్రకారం ఈ రోజుతో పూర్తి అవుతుంది. కానీ అర్హత ఉండి కూడా వివిధ కారణాలతో పథకానికి అప్లై చేసుకొని వారి కోసం తాజాగా ఆ గడువు తేదీలను పొడిగించింది. లేటెస్ట్ గా ప్రకటించిన డేట్ ప్రకారం జులై వ తేదీ వరకు ఈ రెండు పధకాల కోసం అర్హత దారులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
ఇక ప్రతి ఏడాది కాపు నేస్తం కింద రూ. 15000 మరియు వాహనమిత్ర కింద రూ. 10000 అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా మరచిపోయి ఉంటే ప్రభుత్వం ఇచ్చిన సమయంలో చేసుకోగలరు.