ఇక వీఆర్‌ఏలు పర్మినెంట్‌ ఉద్యోగులు.. జీవో కాపీ అందజేసిన సీఎం కేసీఆర్‌

-

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థకు చిహ్నంగా మిగిలిన వీఆర్‌ఏ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం వీఆర్‌ఏలుగా పనిచేస్తున్న అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ ప్రకటించినట్టుగానే రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న 20,555 మంది వీఆర్‌ఏలను సూపర్‌ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నారు. సీఎం ఆదేశాల మేరకు సీఎస్‌ శాంతికుమారి సోమవారం వీఆర్‌ఏల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేశారు.

ఈ మేరకు జీవో కాపీని ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏ జేఏసీ నేతలకు అందించారు. వీఆర్ఏలకు పే స్కేల్ అందిస్తూ.. వీరిని వివిధ ప్రభుత్వ శాఖల్లో విలీనం చేయాలని జీవో జారీ చేసింది. తద్వారా వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి, వీఆర్ఏలుగా పని చేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్నారు. రెవెన్యూ శాఖలో 20వేల మందికి పైగా ఉన్న వీఆర్ఏలను సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నారు. రాష్ట్రంలో వీఆర్ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ అంశాలపై ఆదివారం సచివాలయంలో కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ సమావేశంలోనే వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news