కమల్ హాసన్ ఇండియన్-2 డిజిటల్ రైట్స్ ఇన్ని కోట్లా..!

-

లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘ఇండియన్ 2’. లోక నాయకుడు కమల్ హాసన్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. బ్లాక్ బస్టర్ మూవీ ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా రూపొందిస్తున్నందున మార్కెట్‌లో ఈ ప్రాజెక్ట్‌పై భారీ ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఈ క్రమంలో తాజా అప్‌డేట్స్ అభిమానులను థ్రిల్‌కు గురిచేస్తున్నాయి. దర్శకుడు శంకర్ ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లో ‘ఇండియన్ 2’ వీఎఫ్ఎక్స్ ప‌నులు ప‌ర్యవేక్షిస్తున్నారు. సంబంధిత ఫొటో సైతం నెట్టింట వైరల్ అవుతోంది. అందుకోసం ప్రత్యేకమైన టెక్నాలిజినీ వినియోగిస్తున్నట్లు చెప్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ ఊపందుకుంది.

Latest update on Kamal Haasan's Indian 2 | 123telugu.com

ఈ పాన్ ఇండియా చిత్రం డిజిటల్ హక్కులు కళ్లు చెదిరే ధరకు అమ్ముడైనట్టు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇండియన్-2 డిజిటల్ రైట్స్ దాదాపు రూ.200 కోట్లకు నెట్ ఫ్లిక్స్ ఓటీటీ దక్కించుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్లపై సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ ఇండియన్-2 సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్జే సూర్య, సముద్రఖని, బాబీ సింహా తదితరులు నటిస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news