బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. రేపు “దబిడి దిబిడి” రిలీజ్

-

బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ‘డాకు మహారాజ్’ రూపొందింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12వ తేదీన విడుదల కానుంది. నాగవంశీ – సాయిసౌజన్య భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. మరోవైపు ఈ చిత్రం నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. తాజాగా మూడో సాంగ్ గురించి కీలక అప్డేట్ వచ్చేసింది.

బాలకృష్ణ-బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డాకు మహారాజ్ చిత్రం నుంచి రేపు మూడో సింగిల్ రాబోతున్నట్టు చిత్ర యూనిట్ అప్డేట్ ఇచ్చింది. దబిడి దిబిడి అంటూ సాగే ఈ సాంగ్ రేపు విడుదల చేయనున్నట్టు పేర్కొంది. ఊర్వశి రౌతేలాతో కలిసి బాలయ్య స్టెప్పులేసినట్టు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరోవైపు ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయనీ, ఇంతవరకూ బాలయ్య బాబు సినిమాలలో చూడని యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాలో చూడొచ్చని బాబీ చెప్పడం మరింత హైప్ తీసుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news