ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్ : ప‌రస్ప‌ర బ‌దిలీల‌కు గ్రీన్ సిగ్న‌ల్

-

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. ఉద్యోగులు ఎదురు చూస్తున్న ప‌ర‌స్ప‌ర బ‌దిలీల‌కు కేసీఆర్ ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు స్పందించింది. రాష్ట్రంలో ఉద్యోగులు ప‌ర‌స్ప‌ర బ‌దిలీల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. భార్య భ‌ర్తలు బ‌దీల, అప్పిళ్లు ప‌ర‌ష్క‌రించి దీనికి సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను కూడా జారీ చేసింది. అలాగే బ‌దిలీల‌కు సంబంధించి డెడ్ లైన్ కూడా ఉద్యోగుల ముందు ఉంచింది. మార్చి 1 నుంచి 15 వ‌ర‌కు బ‌దిలీ కోరుకునే ఉద్యోగులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని తెలిపింది.

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

ప‌ర‌స్ప‌ర బ‌దిలీ కోసం స‌హా ఉద్యోగులును వెతుక్కోవ‌డానికి మార్చి నెల‌ వ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం స‌మ‌యం కూడా ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవో నెంబ‌ర్ 317 ను వ్య‌తిరేకించిన ఉద్యోగులు.. ప‌రస్ప‌ర బదిలీల‌కు అయినా.. అవ‌కాశం ఇవ్వాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వానికి గ‌త కొద్ది రోజుల నుంచి ఉద్యోగులు విజ్ఞాప్తి లు చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత రాష్ట్ర ప్ర‌భుత్వం ఎట్టకేల‌కు స్పందించి ప‌ర‌స్ప‌ర బ‌దిలీకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అంతే కాకుండా ప‌ర‌స్ప‌ర బ‌దిలీల కోసం ఇత‌ర ప్రాంతాల్లో ప‌ని చేసే బ‌దిలీ అయ్యే అభ్య‌ర్థిని వెతుక్కొవ‌డానికి నెల రోజుల స‌మ‌యం కూడా ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news