రైతులకు గుడ్ న్యూస్…రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

-

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్..ఇప్పటి వరకు ఐదు ఎకరాలలోపు వారికి నిధులు విడుదల చేసిన సర్కార్.. సోమవారం ఐదు ఎకరాలు పై బడిన రైతులకు నిధులు రిలీజ్ చేసింది.రైతు బంధు (భరోసా) కింద రూ.2వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 5 ఎకరాలు పైబడిన రైతుల ఖాతాల్లో వాటిని జమ చేసింది. కాగా ఈనెల 9లోగా రైతు భరోసా నిధులను పూర్తిగా జమ చేస్తామని పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. వీటితో పాటు పంట నష్ట పరిహారం కింద ఎకరానికి రూ.10వేల నిధులను కూడా ఎన్నికల సంఘం అనుమతితో ప్రభుత్వం విడుదల చేసింది.

కాగా, అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఎకరానికి రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇంతవరకు పూర్తిగా మేం ఇచ్చిన రూ. 10 వేలు కూడా ఇవ్వలేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో అలర్ట్ అయిన సీఎం రేవంత్, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌కు ధీటుగా కౌంటర్ ఇచ్చారు. త్వరలోనే రైతు బంధు నిధులు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రకటించిన కొన్ని రోజుల్లోనే రైతు బంధు నిధులు విడుదల కావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news