బంగారం కొనేవారికి గుడ్ న్యూస్‌..తగ్గిపోయిన బంగారం గిరాకీ

-

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న కాలంలో కూడా బంగారం ధరలు తగ్గకుండా పెరిగిపోయాయి..ఇన్వేస్టర్లు ఎక్కువ శాతం బంగారంపై పెట్టుబడులు పెట్టడంతో బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి..దీంతో దేశంలో బంగారం రేట్లు చరిత్రలో ఎన్నడు లేని విధంగా పెరిగింది..భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో దేశంలో బంగారం గిరాకీ పడిపోయింది..అయితే, పెళ్లిళ్ల సీజన్ మళ్ళీ మొదలుకావడంతో పరిస్థితి మారుతుందని అంచనా వేస్తున్నారు ఆర్థిక రంగ నిపుణులు..అయితే, ఏప్రిల్‌-జూన్‌తో పోలిస్తే మూడో త్రైమాసికంలో పసిడికి కాస్త మెరుగైన డిమాండ్‌ లభించింది..మరోవైపు కొనుగోళ్లు తగ్గినప్పటికీ పసిడిలో పెట్టుబడులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.. ప్రస్తుతం కొవిడ్‌ పరిస్థితులు చక్కబడుతుండటంతో పాటు దసరా, ధనత్రయోదశి, దీపావళిని పురస్కరించుకుని నాలుగో త్రైమాసికంలో పసిడి కొనుగోళ్లు మళ్లీ పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు మార్కెట్ నిపుణులు.

Read more RELATED
Recommended to you

Latest news