ఇంతకాలం చంద్రబాబు చేతుల్లో ఉన్న టీడీపీలో వన్ మ్యాన్ షో గా నడిచేది వ్యవహారం. కళా వెంకట్రావు పేరుకే టీడీపీ అధ్యక్షుడైనా.. రబ్బరు స్టాంపు లైఫే ఆయనది! ఇక నందమూరి తారక రామారావు కలలుగన్న ఆయన రాజకీయ వారసుడు బాలకృష్ణ టీడీపీలో ఉన్నప్పటికీ.. ఆయన హిందూపురం ఎమ్మెల్యే మాత్రమే! పార్టీ నిర్ణయాలు, పదవులు, పొత్తులు మొదలైన వాటితో ఆయనకు సంబంధం లేదు! ఈ పరిస్థితుల్లో తాజాగా టీడీపీలో అంతర్యుద్ధం స్టార్ట్ అయ్యిందని అంటున్నారు!
అవును… ఏక్షణమైతే తనకు ఇష్టమైన కళా వెంకట్రావుని టీడీపీ అధ్యక్షుడిగా తప్పించారో.. మరే క్షణమైతే టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని తెచ్చి పెట్టారో.. నాటి నుంచి చినబాబులో రెండో కోణం వెలుగులోకి వచ్చిందని అంటున్నారు! అచ్చెన్న పదవిలోకి వస్తే తనపరిస్థితి పార్టీలో ఆటలో అరటిపండు అయిపోతుందన్న భయం ముందునుంచీ పుష్కలంగా కలిగి ఉన్న చినబాబు… అది కాస్త వాస్తవరూపం దాల్చే సరికి హడలెత్తిపోతున్నారంట. అందులో భాగంగా తన ఐడెంటిటీని కాపాడుకునే ప్రయత్నంలో తెగ విహార యాత్రలు చేతున్నారని అంటున్నారు!
ఇదే క్రమంలో అధ్యక్షుడైనప్పటినుంచీ అచ్చెన్న కూడా దూకుడు పెంచుతున్నారు. తాను రబ్బరు స్టాంపు కాదని, తనకు కళా కు తెడా ఉందని చెప్పే ప్రయత్నంలో భాగమో లేక తనకు లోకేష్ కూ పోలిక లేదని చెప్పె క్రమమో తెలియదు కానీ.. అన్ని విషయాల్లోనూ తానే ముందుండి నడిపిస్తున్నారు! అన్ని విషయాల్లోనూ తాను ముందుంటున్నారు! బాబుకు చెబుతున్నారో లేదో తెలియదు కానీ.. ప్రెస్ మీట్ లు పెట్టి తన సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు!
ఈ క్రమంలో… అచ్చెన్న వెనకాలే ఎక్కువగా తిరిగితే చినబాబుకు శత్రువులం అయిపోతామని కొందరు భావిస్తుంటే… ఉపయోగంలేని చినబాబు చుట్టూ ప్రదక్షిణలు చేయడం కంటే.. అగ్రెసివ్ అచ్చెన్నతోనే ముందుకు పోతే బెటరని మరికొందరు భావిస్తున్నారంట! దీంతో.. ఇప్పుడు ఏపీ టీడీపీలో రెండు కోటరీలు ఏర్పడ్డాయని అంటున్నారు. ఒకటి లోకేష్ గ్రూప్ కాగా, రెండోది అచ్చెన్నాయుడు గ్రూప్!! సో… ఇకపై టీడీపీలో అంతర్యుద్ధానికి తమ్ముళ్లు సిద్ధం కావాల్సిందేనన్న మాటలు బలంగా వినిపిస్తున్నాయి!!