ఈ మధ్య కాలం లో ఆన్ లైన్ పేమెంట్స్ ని ఎక్కువ మంది చేస్తున్నారు. ముఖ్యంగా ఫోన్ పే, గూగుల్ పే ని ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. మీరు కూడా గూగుల్ పే ని ఉపయోగిస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ ఆన్‌లైన్ పేమెంట్ ప్లాట్‌ఫాం గూగుల్ పే తన యూజర్లకు గుడ్‌న్యూస్‌ను అందించింది. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే…
ట్రాన్సక్షన్స్ మరెంత ఈజీ అవ్వాలని గూగుల్ పే సరి కొత్త సేవలను తీసుకు రావడం జరిగింది. అందుకే ‘ట్యాప్ టూ పే’ సేవలను యూజర్లకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే యూపీఐ సేవల్లో భాగంగా ‘ట్యాప్ టు పే’ ఫీచర్ కోసం ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పైన్ ల్యాబ్స్‌తో గూగుల్ పే కలిసి పని చేసింది. దీనితో కార్డ్‌లను ఉపయోగించకుండా యూపీఐ ద్వారా పేమెంట్స్ చేసుకోచ్చు. అయితే ఈ ఫీచర్ అందరికీ అవ్వదు.
కేవలం డెబిట్, క్రెడిట్ కార్డ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. పైన్ ల్యాబ్స్ రూపొందించిన ఆండ్రాయిడ్ పీఓఎస్ టెర్మినల్‌ని ఉపయోగించి ట్రాన్సక్షన్స్ ని గూగుల్ పే యూజర్లు చెయ్యచ్చు. నీయర్ టూ ఫీల్డ్(ఎన్‌ఎఫ్‌సీ) పేమెంట్స్ ఆప్షన్ అందుబాటులో ఉండే అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో ఈ ఫీచర్ వుంది.
ప్రస్తుతం రిలయన్స్ రిటైల్, స్టార్‌బక్స్, ఫ్యూచర్ రిటైల్ వంటి ఇతర పెద్ద వ్యాపారులకు అందుబాటులో వుంది. ఈ ఫీచర్ వలన తక్కువ సమయంలోనే పేమెంట్స్ చెయ్యచ్చు. పైగా అవుట్‌లెట్లలో, క్యూ మేనేజ్‌మెంట్ అవాంతరాలు చాలా వరకు తగ్గుతాయి కూడా.