తెలంగాణ చేనేత కార్మికులకు శుభవార్త అందింది. ఏపీ నుంచి రూ.600 కోట్ల ఆర్డర్లు తెలంగాణకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కూడా తెలంగాణ నుంచి దుప్పట్లు, బెడ్ షిట్ల కొనుగోలు చేయడానికి ముందుకొచ్చింది. ఆర్డర్లకు అనుగుణంగా తెలంగాణ చేనేత సహకార సంస్థ టెస్కో, ఈ నెల నుంచి వస్త్రాల తయారీని ప్రారంభించనుంది. ఏపీ తమ విద్యార్థుల కోసం 2.50 లక్షల బెడ్ షీట్లు, 55,000 దుప్పట్లు కొనుగోలుకు ముందుకొచ్చింది.
దీంతో ఆ ఆర్డర్ల కోసం వస్త్రాల తయారీ ప్రణాళికను టెస్కో రూపొందించింది. చేనేత సహకార సంఘాలతో పాటు, నేత కార్మికుల ద్వారా వీటిని తయారు చేయించనుంది. ఆ ఉత్పత్తుల తయారీకి అవసరమైన నూలు, పాలిస్టర్, రంగులు, రసాయనాలు ఇతర సామాగ్రిని కార్మికులకు అందజేస్తుంది. అలాగే, బతుకమ్మ చీరల కాంట్రాక్టు కూడా కేసీఆర్ సర్కార్ ఇచ్చింది. దీంతో తెలంగాణ చేనేత కార్మికులకు ఈ ఏడాది చేతి నిండా పని ఉండనుంది.