కరోనా వైరస్ దెబ్బకు అమెరికాలో ఉన్న మన భారతీయులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అమెరికాలో ఉంచుతారో లేదో అర్ధం కాక హెచ్-1బీ వీసాదారులు, గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారు భయపడుతున్నారు. వేలాది మంది విద్యార్ధుల భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడింది. ఈ తరుణంలో ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్-1బీ వీసాదారులు, గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారు…
కరోనా వైరస్ దృష్ట్యా సంబంధిత పత్రాలను సమర్పించాలని నోటీసులు జారీ చేసారు. ఆ పత్రాలు సమర్పించడానికి గానూ గడువుని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అందుకు గానూ 60 రోజుల సమయం ఇస్తున్నట్లు యూఎస్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ కీలక ప్రకటన చేసింది. నోటీసుల్లో పేర్కొన్న చివరి తేదీ తర్వాత 60 రోజుల వరకు వీరిపై ఎలాంటి చర్యలు ఉండవని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అక్కడ వీసాలు జారీ చేయడం లేదు ప్రభుత్వం. ఇమ్మిగ్రేషన్ ని కూడా పూర్తిగా ఆపేశారు. 60 రోజుల పాటు వలసలను నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. గ్రీన్ కార్డు కోసం 2.5 లక్షల మంది ఎదురు చూస్తుండగా, వీరిలో హెచ్-1బీ వీసాదారులు దాదాపు 2 లక్షల మంది ఉన్నారు. లాక్ డౌన్ నేపధ్యంలో కొన్ని రాష్ట్రాల్లో ఉన్న భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.