వలస కూలీలు కొంప ముంచుతారా…?

-

దేశ వ్యాప్తంగా ఇప్పుడు వలస కూలీలు కొంప ముంచే అవకాశాలు ఉన్నాయా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. వలస కూలీలు చాలా మంది ఇప్పుడు తమ రాష్ట్రాలకు వెళ్ళడానికి సిద్దమవుతున్నారు. వీరి కోసం కేంద్ర౦ ప్రత్యేక రైలు సర్వీసులను కూడా నడుపుతుంది. ఏకంగా 300 రైళ్ళు వారి కోసం నడుస్తున్నాయి. ప్రత్యేక బస్సులు అన్నా సరే రాష్ట్రాలు అనుమతించడం లేదు.

దీనితో దేశ వ్యాప్తంగా ఇప్పుడు రైలు సర్వీసులను వారి కోసం కేంద్ర సర్కార్ మొదలుపెట్టింది. సొంత ఊర్లకు వారిని తరలి౦చడానికి కేంద్రం సిద్దమైంది. అయితే ఇప్పుడు వాళ్ళు కొంప ముంచేసే అవకాశాలు ఉన్నాయని అనుమానంవ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి ఝాన్సీ నగరం మీదుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాస్తీ జిల్లాకు వచ్చిన వలసకార్మికుల్లో ఏడుగురికి కరోనా వైరస్ సోకడం కలవర పెట్టింది.

మహారాష్ట్ర నుంచి వలసకార్మికులను బస్సుల్లో బాస్తి జిల్లాకు తీసుకువచ్చి వారికి పరీక్షలు జరిపితే ఏడుగురికి కరోనా వైరస్ ఉందని పరీక్షల్లో తెలిసింది. కరోనా వైరస్ సోకిన కార్మికులను కరోనా ఆసుపత్రికి తరలించారు. వారితో కలిసి ఉన్న వారిని అందరిని కూడా హోంక్వారంటైన్ చేశారు. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వచ్చే వారు అందరిని కూడా చాలా జాగ్రత్తగా ఉంచుతున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news