ఐపిఎల్ ఫాన్స్ కి గుడ్ న్యూస్… డేట్స్ ఫైనల్…!

కరోనా వైరస్ దెబ్బకు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ నానా ఇబ్బందులు పడుతుంది. ఈ నేపధ్యంలోనే టి20 ప్రపంచకప్ ని వచ్చే ఏడాదికి వాయిదా వేసారు. ఇక భారత్ లో ఐపిఎల్ విషయంలో కూడా ఇప్పుడు క్లారిటీ రావడం లేదు. అయితే ఇది దుబాయ్ లో జరుగుతుంది అని ఐపిఎల్ ప్రకటన చేసింది.

తాజాగా దీనిపై కీలక ప్రకటన వచ్చింది. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ సెప్టెంబర్ 19 న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నవంబర్ 8 న ఫైనల్‌తో ప్రారంభం కానుందని బిసిసిఐ వర్గాలు గురువారం జాతీయ మీడియాకు చెప్పాయి. వచ్చే వారం దీనిపై ఐపిఎల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుంది అని తెలిపాయి. ఫైనల్ నవంబర్ 8 (ఆదివారం)న జరుగుతుందని చెప్పింది. 51 రోజుల పాటు ఈ టోర్నీ జరుగుతుంది అని ఒక అధికారి మీడియాకు చెప్పారు.