తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్షాలు..!

-

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు పలుచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలోని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులు కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

కాగా.. ఇప్పటికే హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో గత నాలుగైదు రోజులుగా వర్షం పడుతూనే ఉంది. గత రెండు రోజుల్లో హైదరాబాద్‌లోని గాజులరామారాంలో అత్యధికంగా 74ఎంఎం వర్షపాతం నమోదు కాగా, పీర్జాదిగూడలో 56.8 ఎంఎం వర్షపాతం, వెస్ట్ మారేడ్‌పల్లిలో 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు రాష్ట్రంలోని ఆది‌లా‌బాద్‌, వికా‌రా‌బాద్, మెద‌క్, యాదాద్రి భువ‌న‌గిరి, జన‌గామ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కూడా అత్యధిక వర్షపాతం వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news