మీరు ఏమైనా పాలిసీని ఎల్ఐసీ నుంచి తీసుకున్నారా..? అయితే ఇది మీకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎల్‌ఐసీ ఐపీవోకు వస్తోంది. అది కూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే ఐపీవో ఉండనుంది. దీని మూలంగా పాలసీదారులకు కొంత వాటా ఇస్తున్నారు. అయితే మరి దీని కోసం మరిన్ని వివరాలని ఇప్పుడే తెలుసుకోండి.
దీంతో ఇన్వెస్టర్లు అందరూ ఈ ఐపీవో పైనే ఉన్నారు. ఎల్‌ఐసీ పాలసీ తీసుకున్న వారికి ఈ ఐపీవోలో పాల్గొనేందుకు ఛాన్స్ ఇస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఎల్‌ఐసీ ఐపీవో ఇష్యూ సైజ్‌లో 10 శాతం వరకు వాటాను పాలసీదారులకు కేటాయించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. రూ.1.75 లక్షల కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్‌ను కేంద్ర ప్రభత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి లక్ష్యంగా తీసుకుంది. దీనిలో భాగంగా ఎల్‌ఐసీని పబ్లిక్ ఇష్యూకు తీసుకు వస్తోంది.