ఎల్‌ఐసీ పాలసీదారులకు గుడ్ న్యూస్.. నేటి నుంచే ఆ బెనిఫిట్స్..!

-

దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది జీవనోపాధిని కోల్పోయారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఇంటి నుండి బయటికి రావడానికే భయపడిపోతున్నారు. అయితే మీకు ఎల్‌ఐసీ పాలసీ ఉందా? ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రీమియం చెల్లించలేకపోయారా? దీంతో మీ పాలసీ ల్యా్ప్స్ అయిపోయిందా? అయితే బాధపడొద్దు. మీకోసం ఒక మంచి ఆప్షన్ అందుబాటులో ఉంది. ల్యాప్స్ అయిన పాలసీని మళ్లీ రెగ్యులరైజ్ చేసుకోవచ్చునని ఎల్‌ఐసీ సంస్థ యాజమాన్యం తెలిపారు.

lic
lic

తాజాగా దేశీ దిగ్గజ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తన కస్టమర్లకు తీపికబురు తీసుకొచ్చింది. అంతేకాదు ల్యాప్స్ అయిపోయిన పాలసీలను మళ్లీ రెగ్యులరైజ్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తోంది. దీంతో ల్యాప్స్ అయిన పాలసీ కలిగిన వారు వెంటనే వారి పాలసీని రెగ్యులర్ చేసుకోండి అని సంస్థ యాజమాన్యం తెలిపారు.

అంతేకాదు ఎల్‌ఐసీ పాలసీదారులు వారి ల్యాప్స్ అయిన పాలసీలను ఆగస్ట్ 10 నుంచి అక్టోబర్ 9 వరకు రెగ్యులరైజ్ చేసుకోవచ్చునని యాజమాన్యం తెలియజేశారు. అంతేకాకుండా ఐదేళ్లలోపు ల్యా్ప్స్ అయిన పాలసీలను ఇప్పుడు పునరుద్ధరించుకోవచ్చునన్నారు. అంతేకాకుండా పాలసీదారులు లేట్ ఫీజులో 30 శాతం వరకు తగ్గింపు కూడా పొందొచ్చునని సిబ్బంది తెలిపారు.

అయితే మీరు రూ.లక్ష వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటే ఆలస్య రుసుములో 20 శాతం తగ్గింపు పొందొచ్చునని యాజమాన్యం తెలిపారు. అదే రూ.లక్ష నుంచి రూ.3 లక్షల మధ్యలో ప్రీమియం చెల్లించాల్సి ఉంటే.. లేట్ ఫీజులో 25 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక రూ.3 లక్షలకు పైన ప్రీమియం కట్టాల్సి ఉంటే ఆలస్య రుసుముపై 30 శాతం వరకు తగ్గింపు పొందొచ్చునని అన్నారు. ఇన్సూరెన్స్ పాలసీని పునరుద్ధరించుకోవడం వల్ల పాలసీ ప్రయోజనాలు మళ్లీ తిరిగి పొందొచ్చునని సిబ్బంది తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news