మహేష్ ఫాన్స్ కి అదిరిపోయే న్యూస్…!

-

మహేష్ బాబు హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. గత నెల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే, వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ఎన్నో రికార్డులను కూడా మహేష్ తన ఖాతాలో వేసుకున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు మహేశ్ బాబు ఫాన్స్ కి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఏంటీ అంటే అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు మరో సినిమా చేస్తున్నాడు. అది కూడా వెంకటేష్, వరుణ్ తేజ్ తో కలిసి. అవును ఎఫ్ 2 నిర్మాతలు ప్రకటించి ఆ సినిమా సీక్వెల్ లో మహేష్ నటిస్తున్నాడు. ఎఫ్ 3 అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఈ సినిమాకు కూడా అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా గురించి ఇటీవలే ఒక ప్రకటన వచ్చింది. దీనితో మహేష్ బాబు ఫాన్స్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమాతో అనీల్ కి మహేష్ కి మధ్య మంచి అనుభంధం ఏర్పడింది. దానితోనే మహేష్ బాబు అనీల్ అడిగిన వెంటనే ఈ సినిమాకు ఒప్పుకున్నట్టు సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news