తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది..ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదు ప్రక్రియలో ప్రజలకు వస్తున్న ఇబ్బందులను గ్రహించిన ప్రభుత్వం..ఇంతకు ముందే అప్లై చేసుకున్నవారి పరిస్థితి ఏంటని దరఖాస్తుదారులు అయోమయంలో ఉన్న తరుణంలో తెలంగాణ సర్కారు కీలక ప్రకటన చేసింది..2015లో దరఖాస్తు చేసుకున్నవారు.. మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది..కొత్త నిబంధనల ప్రకారమే పాత వాటిని క్లియర్ చేయాలని ఆదేశించింది. దీంతో 2015నుంచి పెండింగ్‌లో L.R.Sలకు మోక్షం లభించింది..
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీల నుంచి ఇప్పటివరకు 11లక్షల 57వేల దరఖాస్తులు వచ్చాయి. జీహెచ్ఎంసీతో సహా మున్సిపల్ కార్పొరేషన్‌లో మరో 2లక్షల 24వేల దరఖాస్తులు వచ్చాయి. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే 118కోట్ల ఆదాయం వచ్చింది. దరఖాస్తుల సంఖ్య పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు.