పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త…!

-

తాజాగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFO తన సబ్‌స్క్రైబర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో 2019-20 సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ అకౌంట్ వడ్డీ మొత్తాన్ని సబ్‌స్క్రైబర్ల పీఎఫ్ అకౌంట్లలో జమ చేయడం స్టార్ట్ చేసినట్టు చెప్పడం జరిగింది. దీనితో 6 కోట్ల మందికి పైగా సబ్‌స్క్రైబర్లకు ఊరట లభించింది. అయితే 8.5 శాతం వడ్డీని 6 కోట్ల మందికి పైగా చెల్లిస్తున్నామని చెప్పడం జరిగింది. మీ ఎకౌంట్ లో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవాలంటే..? దీని కోసం ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌కు వెళ్లాలి. ఆ తర్వాత యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఈపాస్‌బుక్ ‌పై క్లిక్ చేయాలి.

ఇప్పుడు మీ ఖాతా లోకి వడ్డీ వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు. లేదంటే ఉమాంగ్ యాప్ ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ ని చూడొచ్చు. ఈ యాప్ ఓపెన్ చేసి ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీసెస్‌ లోకి వెళ్లాలి. అక్కడ పాస్ బుక్ ఆప్షన్ ఉంటుంది. యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. అప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి బ్యాలెన్స్ చూసుకోవచ్చు. లేకపోతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 011-22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి.

లేదంటే EPFOHO UAN అని టైప్ చేసి 7738299899 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపినా కూడా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఇలా ఎంతో సులువుగా డబ్బులు పడ్డాయో లేదో చూసుకోవచ్చు. ఇది ఇలా ఉంటె సాధారణంగా ఉద్యోగుల వేతనం నుంచి 12 శాతం డబ్బులు పీఎఫ్ ఖాతాకు వెళ్లిపోతాయి. ఇదే మొత్తంలో డబ్బులను కంపెనీ కూడా పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లో జమ చేస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news