గంగినా.. ఆరు నెలలపాటు ద్రాక్ష పండ్లను నిల్వ ఉంచే పద్దతి.. ఆఫ్ఘన్ ప్రజల ఆలోచన..

-

మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలని కలిగి ఉన్న పండ్లని ఎక్కువ రోజులు నిల్వ చేయలేం. రిఫ్రిజిరేటర్ లో ఉంచినా కూడా చాలా పండ్లు పాడైపోతాయి. అలా పాడయ్యే వాటిలో ద్రాక్ష ఒకటి. ద్రాక్ష పండ్లని నెలల పాటు నిల్వ చేయడం చాలా కష్టం. కానీ ఆఫ్ఘన్ ప్రజలు ద్రాక్ష పళ్ళని నిల్వ చేస్తున్నారు. పురాతన పద్దతిలో నిల్వచేసిన తమకి కావాల్సినపుడు అమ్ముకుని వ్యాపారం చేసుకుంటున్నారు. అలా నిల్వచేసే పద్దతిని గంగినా అంటారు.

తడి మట్టితో తయారు చేసిన కంటైనర్ ని గాలి కూడా చొరబడకుండా తయారు చేసి నిల్వచేస్తారు. ప్రత్యేకంగా చలికాలంలో ద్రాక్ష పండ్లని అమ్ముకోవడం కోసం వానాకాలంలో గంగినా పద్దతిలో నిల్వ చేస్తారు.

సాసర్ లాంటి కంటైనర్ తయారు చేసి మట్టి ఎండేవరకు ఎండలో ఎండబెడతారు. ఆ తర్వాత సూర్యుని ఎండ కూడా పడకుండా అందులో ద్రాక్ష వేసి నిల్వ ఉంచుతారు. ఐతే ఇలా నిల్వ ఉంచే పద్దతిలో పాడైపోయిన అంటే విరిగిన ద్రాక్ష పండ్లని వేరు చేస్తారు. విరగకుండా ఆరోగ్యంగా ఉన్న ద్రాక్ష పళ్ళని మాత్రమే గంగినా పద్దతిలో నిల్వ చేస్తారు.

గంగినా కంటైనర్లలోకి గాలి కూడా చొరబడకుండా చీకటి గదిలో ఉంచాలి. అలా చేస్తేనే లోపల ఉన్న ద్రాక్ష చాలా తాజాగా ఉంటాయి. ఇలా నిల్వ ఉంచిన ద్రాక్షని, మార్కెట్లో మంచి రేటు రాగానే అమ్మడానికి సిద్ధంగా ఉంచుతారు. ఒక కంటైనర్ లో కిలో ద్రాక్ష ఉంటుంది.

ఈ పద్దతిన నిల్వ ఉంచుతున్న ద్రాక్షల వల్ల రైతులకి బాగా ఆదాయం వస్తుందట.

Read more RELATED
Recommended to you

Latest news