భారత్ లోకి రావడానికి చైనా సరికొత్త ప్లాన్…?

-

లడఖ్‌ లో కొనసాగుతున్న ప్రతిష్టంభన కొనసాగుతున్న తరుణంలో, గత వారం ఉత్తర సిక్కింలోని నాకు లా వద్ద సరిహద్దు మీదుగా చొరబడటానికి చైనా చేసిన ప్రయత్నాన్ని భారత్ అడ్డుకుంది. ఇరు వర్గాల మధ్య చిన్న పాటి ఘర్షణ జరిగిందని కాని భారత సైన్యం దాన్ని అడ్డుకుంది అని అధికారులు పేర్కొన్నారు. గత వారం చైనా సైనికులు సరిహద్దు దాటడానికి ప్రయత్నించారు అని మీడియాకు వెల్లడించారు.

దీని ఫలితంగా హింసాత్మక ఘర్షణ జరిగింది అని పేర్కొన్నారు. హింసాత్మక ఘర్షణ ఫలితంగా రెండు వైపులా గాయాలయ్యాయి అని అధికారులు పేర్కొన్నారు. భారతదేశంలోని సిక్కింలోని నాకు లా వద్ద జరిగిన ఘర్షణలో 20 మంది చైనా సైనికులు గాయపడగా, నలుగురు భారత ఆర్మీ సైనికులు గాయపడినట్లు సమాచారం.అయితే, ఉత్తర సిక్కింలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ భారత ఆర్మీ సైనికులు చైనాను అడ్డుకున్నారు.

సిక్కింలో ఘర్షణ స్థలంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది అని, కాని అలజడి లేదని అధికారులు తెలిపారు. ప్రోటోకాల్స్ ప్రకారం నాకు లా వద్ద ముఖాముఖిని స్థానిక కమాండర్లు పరిష్కరించారని భారత సైన్యం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. తూర్పు లడఖ్‌లో సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత్, చైనా తొమ్మిదవ రౌండ్ సైనిక చర్చలు జరిపిన ఒక రోజు తర్వాత ఈ సంఘటన జరిగింది. తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ చర్చలు ముగిసాయి.

Read more RELATED
Recommended to you

Latest news