ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..!

-

ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో మూసివేసిన స్టాఫ్ బినవోలెంట్ త్రిఫ్ట్ (ఎస్ బీ టీ) ఫండ్ ను తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పదివేల మందికి పైగా ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. ఉద్యోగుల కంట్రిబ్యూషన్ తో ఎస్ బి టి ఫండ్ ను గతంలో కొన్నేళ్ల పాటు నిర్వహించారు.

దీని ద్వారా ఆర్టీసీ ఉద్యోగులు చనిపోయినా…పదవి విరమణ పొందినా ఈ నిధి నుండి లక్షా యాభై వేల చొప్పున చెల్లించేవారు. అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఎస్ బి టి ఫండ్ స్థానం లో ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీం అమల్లోకి వచ్చింది. అయితే ఇది 55 ఏళ్ల లోపు ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. దాంతో 55 ఏళ్లు దాటిన ఉద్యోగులు కోసం ఆర్టీసీ మళ్లీ ఎస్ బి టి ఫండ్ ను అమల్లోకి తెచ్చింది. ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news