”మొగలిరేకులు” ఫేమ్ పవిత్రనాథ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య

మొగలి రేకులు ఫేమ్‌ పవిత్ర నాధ్‌ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆయన భార్య. తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసిన పవిత్ర నాథ్‌ భార్య శశి రేఖ… నిన్న రాత్రి షీ టీమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త పవిత్ర నాథ్‌ తో పాటు.. తన అత్త మామలు టార్చర్‌ పెడుతున్నారంటూ కూడా పిర్యాదు లో పేర్కొంది.

తన భర్తకు అమ్మాయిలంటే పిచ్చి అని.. అర్థరాత్రి రెండు, మూడు అయినా అమ్మాయిలతోనే మాట్లాడుతుంటాడని చెప్పింది శశిరేఖ. జాతకాలు చెబుతానని అమ్మాయిలను నేరుగా ఇంటికే తీసుకొచ్చేవాడని ఆరోపించింది. ప్రశ్నించినందుకు పలుమార్లు తనపై చేయిచేసుకున్నాడని అంటోందామె.

పవిత్రనాథ్ ఓ అమ్మాయితో ఎనిమిదేళ్లు ప్రేమాయణం నడిపాడని, అతడి అఫైర్లపై అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపింది శశిరేఖ.2009లో శశిరేఖకు పవిత్రనాథ్‌తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరో వైపు అత్తమామల నుంచి కూడా తనకు మద్దతు లేదని, తనను ఇంట్లోంచి గెంటివేశారని ఆరోపించింది పవిత్ర నాథ్‌ భార్య శశి రేఖ. అమె పిర్యాదు నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.