ఆగని పెట్రో మంట.. మరోసారి పెరిగిన ధరలు

మన దేశం లో పెట్రోల్‌ మరియు డీజిల్‌ ధరలు పెరగడమే తప్ప.. తగ్గేలా కనిపించడం లేదు. రోజు రోజు కు 30 పైసలకు పైగా చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇక తాజాగా మరోసారి పెట్రోల్‌ మరియు డీజిల్‌ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 0.37 పైసలు మరియు లీటర్ డీజిల్ పై 0.38 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.24 కు చేరగా డీజిల్ ధర రూ. 95.97 కు పెరిగింది.

Petrol and Diesel
Petrol and Diesel

అలాగే హైదరాబాద్ నగరం లో లీటర్ పెట్రోల్ ధర రూ. 111. 55 కు చేరగా డీజిల్ ధర రూ. 104.70 కు పెరిగింది. ముంబై లో రూ. 113.12 , కు చేరగా డీజిల్ ధర రూ. 104.00 కు పెరిగింది. కోల్‌ కతా నగరం లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.22 కు చేరగా డీజిల్ ధర రూ. 100.25 కు పెరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 113. 49 కు చేరగా డీజిల్ ధర రూ. 106. 04 కు చేరుకుంది. సెప్టెంబర్ 5 వ తేదీ తర్వాత డీజిల్ ధర రూ. 7.02, పెట్రోల్ ధర రూ. 5.72 మేర పెరిగింది.